Skip to content

‘చీన్ టపాక్ డమ్ డమ్’ ఫస్ట్ క్రాకర్ ఆవిష్క‌రించిన అడివి శేష్

అల్లరి, సరదా, నవ్వులతో ప్రేక్షకులను అలరించేందుకు ‘చీన్ టపాక్ డమ్ డమ్’ సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఫస్ట్ క్రాకర్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ క్రాకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి వై.ఎన్.లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ సన్నివేశాలు, ఆసక్తికరమైన పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లోని “కాన్ సెన్స్ క్రౌన్స్ వెన్ కామన్ సెన్స్ డ్రౌన్స్’ అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది…

Read more