‘టాక్సిక్: ’లో రెబెకా పాత్రలో తారా సుతారియా
రాకింగ్ స్టార్ యష్ ప్రెస్టీజియస్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’పై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ.. మిస్టీరియస్, గ్లామరస్ ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న హుమా ఖురేషి.. పవర్ఫుల్ గంగ పాత్రలో నటిస్తోన్న నయనతార పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలై టాక్సిక్ సినిమాలోని డార్క్ వరల్డ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశాయి. తాజాగా మేకర్స్ అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన రెబెకా పాత్రలో నటిస్తోన్న తారా సుతారియా పాత్రను పరిచయం చేశారు. ఇలా సినిమాలోని పాత్రలను పరిచయం చేయటం ద్వారా.. సినిమా స్కేల్ పాన్ ఇండియా రేంజ్‌ను తెలియజేస్తోంది. ఇందులో హై యాక్షన్ సీక్వెన్సెస్, భారీ డ్రామా, కథలోని…
