‘హుషారు 2’ అనౌన్స్మెంట్
కుర్రకారులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్ తర్వాత..తాజాగా అందరిలో ఆసక్తిని పెంచుతూ దర్శకుడు శ్రీ హర్ష ‘హుషారు 2’ను సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీని టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. మొదటి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన కబూమ్ బీరు ఓ ట్రక్కులో ఉంది. ఆ ట్రక్కుకు రెండు వైపులా కొందరు పట్టుకుని బలంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము కనిపిస్తోంది. పాము మధ్యలో స్నేహితులు చిక్కుకుని భయపడుతున్నారు. ట్రక్కు కింద తాబేలు ఉంది…
