మనోజ్ మంచు, మౌనిక భూమా మంచు ఆధ్వర్యంలో ప్రారంభమైన “ఐక్య ధైర్య సేన సమితి”
తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మనోజ్ మంచు , ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు. “Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడిన ‘రా కింగ్’ మనోజ్ మంచు భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన…
