జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో మోహన్‌లాల్ ‘దృశ్యం 3’
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంథోనీ పెరుంబవూర్ నిర్మించగా, మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ‘దృశ్యం 2’ సంఘటనల తర్వాత జార్జ్‌కుట్టి తన కుటుంబానికి భద్రమైన భవిష్యత్తును నిర్మించుకున్నట్లు కనిపిస్తుంది. తన గత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఒక విజయవంతమైన సినిమాను కూడా రూపొందిస్తాడు. అయితే గతం మళ్లీ అతడిని వెంటాడుతుంది…
