‘హ్యాపీ జర్నీ’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా – నటి ఝాన్సీ
అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ హిట్ ‘హ్యాపీ జర్నీ’. జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించారు. అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఝాన్సీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే వెళ్లి చూడండి. చాలా మంచి…
