Skip to content

‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది – ఆర్. నారాయణమూర్తి

హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. ఈ మూవీకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ టీజర్‌ని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ .. ‘హర్ష గారు ‘హుషారు 2’లో…

Read more

అంచ‌నాలు పెంచుతోన్న ‘హుషారు 2’ టీజ‌ర్‌

కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్న పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి ‘‘ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు..కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌... అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు..మ‌రోవైపు అడ‌విలో క్రూరంగా వేటాడే సాయుధులు వీళ్ల మ‌ధ్య‌లో న‌లిగి పోతున్న ప్ర‌జ‌లు ఒక నాయ‌కుడి కోసం ఎదురు చూస్తున్నారు.. ఎవ‌రా నాయ‌కుడు’’ అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ‘హుషారు 2’ టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది. ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హుషారుకు సీక్వెల్ ఇంత యాక్ష‌న్ మోడ్‌లో రాబోతుందా! అనే డౌట్ అంద‌రి వ‌చ్చేసే లోపు.. రాహుల్ రామ‌కృష్ణ ‘అరే చంద్ర‌మోహ‌న్ ఆపు.. నీ స్టోరీకి, ఎమోష‌న్స్‌కి ఏమైనా సంబంధం ఉందా టోట‌ల్ డిస్‌క‌నెక్ట్?’ అని గ‌ట్టిగా…

Read more

‘హుషారు 2’ అనౌన్స్‌మెంట్

కుర్రకారులో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపిన ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంత‌టి ఘన విజయాన్ని అందుకుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ స‌క్సెస్ తర్వాత..తాజాగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతూ దర్శకుడు శ్రీ హర్ష ‘హుషారు 2’ను సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీని టైటిల్ అనౌన్స్మెంట్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మొద‌టి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన క‌బూమ్ బీరు ఓ ట్ర‌క్కులో ఉంది. ఆ ట్ర‌క్కుకు రెండు వైపులా కొంద‌రు ప‌ట్టుకుని బ‌లంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము క‌నిపిస్తోంది. పాము మ‌ధ్య‌లో స్నేహితులు చిక్కుకుని భ‌యప‌డుతున్నారు. ట్ర‌క్కు కింద తాబేలు ఉంది…

Read more