వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న హీరో కౌశిక్ మేకల
‘ప్రియురాలు’, ‘సిట్(ZEE5)’ వంటి ప్రాజెక్ట్‌లతో అందరినీ ఆకట్టుకున్న యువ నటుడు కౌశిక్ మేకల. యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రస్తుతం కొత్త కొత్త ప్రాజెక్టులు, డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో యంగ్ హీరో కౌశిక్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులపై ముద్ర వేశాడు. ప్రస్తుతం ‘పార్ట్ టైమర్స్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోగా పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. నాగార్జున, ఎన్టీఆర్‌లు చేసిన యాడ్స్‌లోనూ కౌశిక్ మెరిశాడు. సిరీస్‌లు, సినిమాలు, ప్రకటనలు అంటూ కౌశిక్ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి కౌశిక్ వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టారు. కౌశిక్ కీలక పాత్రలో నటించిన "వైరల్ వీడియో" అనే చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది…
