ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్
మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, "అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన…
