సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాలి: ప్రీరిలీజ్ వేడుకలో అతిథులు..
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర…
