గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి (Madhu Reddi) హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు. ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న 'అగ్ని నక్షత్రం' లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి…
