Skip to content

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హర్షం

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ 2026 లో శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు” (జీవన సాఫల్య పురస్కారం) లభించడం, ఆ పురస్కారాన్ని ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీమతి గుప్తా రేఖ గారి చేతుల మీదుగా వారు అందుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రస్థానంలో ఇది మరొక మైలురాయి మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే ఇది గర్వకారణం. ఈ సందర్భంగా, శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇట్లు భవదీయులు (టి. ప్రసన్న కుమార్) (వై.వి.స్. చౌదరి)…

Read more

“తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను…

Read more

శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు – ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్

చెన్నైలో తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ 1998వ సంవత్సరం, నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడి 27 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 'పరాభవ' నామ సంవత్సర ఉగాది పండుగ రోజున 'మహిళా రత్న' మరియు 'బాపు బొమ్మ', 'బాపు రమణ', 'విశిష్ట' ఉగాది పురస్కారాలు మరియు సినీ రంగం-2025 పురస్కారాలను మ్యూజిక్ అకాడమిలో మార్చి 15వ తేది 2026 ఆదివారం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు 2025లో విడుదలైన చలన చిత్రాలలో వివిధ విభాగాలకు సంబంధించిన నటీ నటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను "ఉగాది పురస్కారము"లతో మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులకు "మహిళా రత్న పురస్కారము"తో సత్కరించుటకు కమిటి సభ్యులతో చర్చించి…

Read more

GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం

GMAA ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో శిరీష గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "R". గోలి రామకృష్ణ దర్శక నిర్మానంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలు కావడం జరిగింది. సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సినిమాలోగ్రాఫర్ గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్ గా మునీష్, కొరియోగ్రాఫర్ గా శివాజీ, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా…

Read more

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

హీరోయిన్ అనన్య నాగళ్ళకు తీర్థ ప్రసాదాలు అందచేసిన తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్ వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర తదితర చిత్రాలలో ద్వారా హీరోయిన్గా నటించిన తెలుగు అమ్మాయి లాగల్ల నేడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు తాతాయగుంట అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఓ తమిళ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాతాయుగుంట అమ్మవారిని దర్శనం పూర్తి చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు ఆమెను ఆహ్వానించి పూజా కార్యక్రమాలు అన్ని ఆమె చేతుల మీదగా దగ్గర…

Read more

ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ శాంతి కోసం థాయ్‌లాండ్ కి చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు(మాంక్స్) 22 నుంచి కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుండి తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి తుర్కయాంజిల్ వరకు 17 కిలోమీటర్ల పాదయాత్రలో కింగ్ బుద్ద హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం కింగ్ బుద్ధ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మిస్తున్న డైరెక్టర్ సత్యారెడ్డి మెడలో గౌతమ బుద్ధుడి లాకెట్‌ను ధరింపజేసిన సీనియర్ మాంక్స్ కింగ్ బుద్ధ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాలని ఆశీర్వదించారు. ఈ సందర్బంగా సత్యారెడ్డి మాట్లాడుతూ... "అమెరికాలో ప్రారంభించిన “కింగ్ బుద్ద (We…

Read more

ఘనంగా “అలా జరిగిన కథ” ప్రెస్ మీట్

ఎపిఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుక శ్రీనివాస్ నిర్మాతగా ప్రభు సూర్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం అలా జరిగిన కథ. కెవి గోలంధర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహావీర్ సంగీతాన్ని అందించగా కొండవీటి రవి కుమార్ ఎడిటర్ గా పని చేశారు. విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రం శ్రీను, రవి వర్మ, శివ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ సినిమాకు నాకు చాలా అనుబంధం ఉంది. దర్శకుడు సూర్యకు సినిమాలపై మంచి అవగాహన ఉంది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…

Read more

ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్

ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్ ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరినీ విజన్ మూవీ మేకర్స్ ప్రోత్సహిస్తుంది : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నిర్మాత సాయి సుధాకర్ కొమ్మలపాటి విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతి శతకం' సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల అయింది. మహేష్ విట్ట, శైలజమ్మ, టేస్టీ తేజ, జెడివి ప్రసాద్, కరణ్…

Read more

పవన్ కళ్యాణ్‌తో రాజేంద్ర ప్రసాద్ భేటీ

అమరావతి: ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. ఆత్మీయ పలకరింపు: తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మ పురస్కారం రావడం పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో…

Read more

చంద్రబాబు నాయుడును కలిసిన రాజేంద్ర ప్రసాద్

అమరావతి: ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆయనను ఘనంగా సత్కరించారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Read more