Skip to content

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ Telugu News
తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ Telugu News
తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ Telugu News

హీరోయిన్ అనన్య నాగళ్ళకు తీర్థ ప్రసాదాలు అందచేసిన తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్

వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర తదితర చిత్రాలలో ద్వారా హీరోయిన్గా నటించిన తెలుగు అమ్మాయి లాగల్ల నేడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు తాతాయగుంట అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఓ తమిళ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాతాయుగుంట అమ్మవారిని దర్శనం పూర్తి చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు ఆమెను ఆహ్వానించి పూజా కార్యక్రమాలు అన్ని ఆమె చేతుల మీదగా దగ్గర ఉండి చూసుకొని తీర్థ ప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా నటి అనన్య నాగళ్ళ తనకు ఈ గుడిపట్ల అలాగే అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని తన మాటలలో తెలిపారు. తాను గతం నుండి అమ్మవారిని దర్శించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ ఇప్పటికి ఆ సమయం వచ్చిందని, ఈ అమ్మవారి దేవాలయ విశిష్టత ఎన్నోసార్లు విన్నానని తెలిపారు. నేడు ఈ తాతాయుగుంట దేవాలయంలో అమ్మవారి దర్శనం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. గతంలో కూడా తాతాయగుంట అమ్మవారి దేవాలయాన్ని నటి మీనాక్షి చౌదరి తదితరులు దర్శించుకోవడం జరిగింది.

గతంలో వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ నుండి ప్రశంసలు లభించాయి. అంతేకాక పొట్టేల్, మల్లేశం తదితర చిత్రాల ద్వారా ఆమెకు ఎంతో మంచి పేరు లభించింది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే తనలో దైవభక్తి మాత్రం ఎన్నడూ ఉంటుందని నటి అనన్య నాగళ్ళ తెలిపారు.

హీరోయిన్ అనన్య నాగళ్ళ, అర్చన అయ్యర్లు వేరువేరుగా శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

See also  ఈ నెల 9వ "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.