విశాఖలో జరిగిన సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో APFDC చైర్మన్ భరత్ భూషణ్
భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 12 ఏళ్లకు ఏర్పడిన APFDC కమిటీ సభ్యులను వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ సభ్యులు, టాలెంట్ రియల్ స్టూడియో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే టాలెంట్ ప్రొడక్షన్స్, కంటిపూటి క్రియేషన్స్ పేరుతో రెండు నూతన సినీ నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఈ సందర్భంగా APFDC ఛైర్మన్ భరత్…
