Skip to content

ఎస్వీబీసీ అధికారులతో టీటీడీ ఛైర్మన్ సమావేశం

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సూచించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ, టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ. శరత్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ... "ఛానెల్ నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ప్రకటనలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచాలి, ఇందుకోసం మార్కెటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి" అని సూచించారు. ఈ సందర్భంగా ఛానెల్ ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు, ఇతర కార్యక్రమాలు, కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను…

Read more

ఆర్.పి. పట్నాయక్ నేడు తిరుపతిలో ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు..

ఈ సందర్భంగా జరిగిన హృద్యపూర్వక సమావేశంలో, ఆర్.పి. పట్నాయక్ ఎస్వీబీసీ ఛైర్మన్‌కు తన ఇటీవలి భక్తి సంగీత ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇందులో “దేవ కరుణామృతం” ఆల్బమ్ (లక్ష్మీ నారాయణస్తోత్రం, దత్త పాదుకాస్తోత్రం మరియు దత్త చిన్మయాస్తోత్రంతో కూడినది), ఆధ్యాత్మిక “అప్ప అప్ప అయ్యప్ప” సింగిల్, మరియు శ్రీరాముడికి అంకితమైన “పిబరే రామ రసం” పాట ఉన్నాయి. అలాగే 18 అధ్యాయాలతో కూడిన తన “సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం” ప్రాజెక్ట్ వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ ఆర్.పి. పట్నాయక్ చేపట్టిన భక్తి కార్యక్రమాలను అభినందించారు, ఆధ్యాత్మిక కంటెంట్ నాణ్యతపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, తమ సమయాన్ని కేటాయించినందుకు ఆర్.పి. పట్నాయక్‌కు కృతజ్ఞతలు…

Read more

నా ప్రతిభను నమ్మి అవకాశం ఇచ్చిన ఉదయభాను గారికి థాంక్స్ : ఫ్యాషన్ డిజైనర్ భావన పోలేపల్లి

గతంలో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను గారు మొదటిసారి ఒక సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం జీ5లో స్టీమ్ అవుతున్న పంచనామా సిరీస్ ను ఆమె ఎంతో ప్యాషన్ గా నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శక ముగించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ సెప్టెంబర్ 11వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్ లో ఉంది. పంచనామా సిరీస్ స్ట్రీమింగ్ దగ్గరైన సమయంలో ఈ సిరీస్ బృందం ప్రివ్యూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఉదయభాను గారు ఈ సిరీస్ కు పని చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన భావన పోలేపల్లి గారి గురించి మాట్లాడుతూ... "తన పని పూర్తయిన తరువాత కూడా కంటెంట్…

Read more

#LUB చిత్ర ప్రారంభం

జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB. ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్ గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా, లిరికల్ రైటర్ గా జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస…

Read more

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి సి కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అలాగే అదే మన ప్యానల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా మన ప్యానెల్ నుండి మోహన్ వడ్లపట్ల గారు, ప్రోగ్రెస్ ప్యానెల్ నుండి దామోదర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మన ప్యానల్ నుండి అమ్మిరాజు గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు గెలిచారు. ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుండి ముగ్గురు అనగా మైత్రి రవి గారు, నిరంజన్ రెడ్డి గారు, డిఎస్ రావు గారు గెలవగా మన ప్యానెల్…

Read more

మన ప్యానెల్ ప్రెస్ మీట్

సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ : * ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. * నిన్న కొన్ని హామీలు, వగదనలు చేసినవి చూసాము. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. * నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కౌన్సిల్ కి గండి కొట్టి గిల్డ్ కు తీసుకుని వెళ్ళి ఆ సొమ్మును అనుభవిస్తుంది ఎవరు? అనేది తెలుస్తుంది. * మా వాళ్ళు 7 మంది ఉంటే మీ వాళ్ళు 16 మంది ఉన్నారు. గత రెండున్నర ఏళ్లగా మీరేం చేశారు? * నిన్న వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? ఎన్నికల సమయంలో వచ్చి హామీలు…

Read more

థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వంతో చర్చలు: APFDC చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌కు విజయవాడలో ఎగ్జిబిటర్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భరత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర శాఖల లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా 5 ఏళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడామని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉందని భరత్ భూషణ్ తెలిపారు. ఎఫ్‌డీసీలో ఎగ్జిబిటర్లు మెంబర్‌షిప్ తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఉంటే…

Read more

మీడియా సమక్షంలో “డెలులు” చిత్ర టీజర్ లాంచ్

“చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” - డెలులు చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ రాజ్ కుమార్ చిరంజీవి గారి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - డెలులు చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ రాజ్ కుమార్ క్రియేటివ్ లాంచ్ పాడ్ బ్యానర్ పై ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెలులు. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు పోషించారు. రేష్మిత్ ఎస్ కౌశిక రచించిన ఈ కథకు విజయ రాజ్ కుమార్ డైలాగులు అందించగా జై…

Read more

మన ప్యానెల్ కీలక సభ్యుల ప్రెస్ మీట్

తెలుగు చిత్రం నిర్మాతల మండలి ఎన్నికలు సమీపించగా ఎన్నికలలో పోటీ చేస్తున్న బ్యానల్స్ లో ఒకటైన మన ప్యానెల్ సభ్యులు నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మన ప్యానెల్ సభ్యులందరూ పాల్గొని ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా... సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ : * మన ప్యానెల్ తరపున అందరికీ నమస్కారం. నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు థాంక్స్. బండ్ల గణేష్ తో మాట్లాడటం జరిగింది. * గిల్డ్ వారికి మేము పూర్తి సహకారం అందించాము కానీ వారు ఈ సంస్థకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్నికల సమయంలోనే వారు కనిపిస్తారు. గిల్డ్ లో కౌన్సిల్ కి వచ్చే…

Read more

నాదనీరాజనం కళాబృందాల ఎంపిక కమిటీ సమావేశం

తిరుపతిలోని ఎస్‌వీబీసీ ఛానెల్ కార్యాలయంలో మంగళవారం నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాల ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ అధ్యక్షత వహించారు. కళా, సాంస్కృతిక రంగాల్లో నిపుణులైన సెలెక్షన్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాదనీరాజనం కార్యక్రమం కోసం ఎస్‌వీబీసీకి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. కళాబృందాలు పంపిన వీడియోలను వీక్షించి, వారి ప్రతిభ, ప్రదర్శన స్థాయి, కార్యక్రమానికి అనుకూలతను పరిశీలించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్న కళాబృందాలను కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కళాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా…

Read more