‘ఒక కోర్టు కేసు ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, జులై 17న థియేటర్స్ లో విడుదల !!!
టాలీవుడ్లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, జులై 17న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. చిత్ర దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ.. “మేము ఈ చిత్రానికి ‘ప్రతి…
