‘నాగబంధం’ నుంచి అబ్దాలిగా రిషబ్ సాహ్నీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం' ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. దీనికి ముందు, ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు బాలీవుడ్ 'ఫైటర్'లో తన అద్భుతమైన ప్రజెన్స్ తో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ నాగబంధంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750లో బ్యాక్ డ్రాప్ లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్…
