నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం – APFDC చైర్మన్ భరత్ భూషణ్
భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఘనంగా నివాళులర్పించింది. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లోని ఆర్టీసీ ప్రధాన హాల్‌లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కే. విశ్వనాథన్, బోర్డు సభ్యులు పాల్గొని నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ FDC చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ, బోర్డు సభ్యులు సమావేశంలో చర్చిస్తూ.. భారతీయ సినీ రంగానికి నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నటుడిగా నానా…
