హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా “ఓరి నాయనో” మూవీ టైటిల్ లాంచ్
హైదరాబాద్: తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్టర్ గొండి మణితేజ తెరకెక్కిస్తున్న “ఓరి నాయనో” - (Tag line: Every life will have Ori..Nayano! Moment) సినిమా టైటిల్‌తో పాటు, సినిమా కార్యాలయాన్ని ముఖ్య అతిథి హీరో నవీన్ చంద్ర ఆవిష్కరించారు. మాదాపూర్‌లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో 'మా ఊరి పొలిమెర' డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవింద్ర, డీవోపీ వెట్రి పళనిస్వామితో పాటు, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, “ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన పూజా…
