ఘనంగా ‘తీరం’ సినిమా టైటిల్ సాంగ్ విడుదల
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ, ‘తీరం’ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు…
