నాని విడుదల చేసిన అలెల్లె.. అలెల్లె సాంగ్ లాంచ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్ తో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ 'అలెల్లె అలెల్లె'ను లాంచ్ చేశారు. కొన్ని పాటలు కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయి… కొన్ని పాటలు కథ నుంచి వస్తాయి. ‘అలెల్లె అలెల్లె’ అలాంటి ప్రత్యేకమైన పాట. జివి ప్రకాష్ కుమార్…
