రజనీకాంత్ ‘ధర్మన్’ లో శ్రీలీల గ్లింప్స్ రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోకి మరో స్టార్ ను మేకర్స్ పరిచయం చేశారు. హీరోయిన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో శ్రీలీ ఆకట్టుకునే అవతార్‌లో కనిపిస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ““She’s the spark and she’s the pataka” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సినిమాలో శ్రీలీల పోషించబోయే పాత్ర ఎంతో సందడిగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. రాజ్ కమల్ ఫిల్మ్స్…
