‘పురుషః’ నుంచి ‘దేవనాయకి’ సాంగ్ రిలీజ్
డిఫరెంట్ ప్రమోషన్స్‌తో ‘పురుష:’ చిత్రయూనిట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాని నిర్మించారు. పక్కా ఫ్యామిలీ కథ, భార్యాభర్తల చిలిపి తగాదాలతో ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పురుష:’ మూవీ రాబోతోంది. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కానున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రల్ని పోషించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను, హైప్‌ను క్రియేట్ చేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి…
