Skip to content

‘జయమ్ము నిశ్చయమ్మురా – సీజన్ 2’లో స్నేహం, నవ్వులు పంచనున్న త్రివిక్రమ్, సునీల్, తమన్

సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. సెలబ్రిటీల జీవితాల్లోని స్నేహాలు, కష్టాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకున్నప్పుడే వారి సంభాషణలు ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఆవిష్కరిస్తోంది ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ జీ తెలుగు టాక్ షోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలు, మనసులోని మాటలు, అనుకోకుండా పంచుకునే హాస్య సంఘటనలతో ఈ షో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సందడి చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో వీరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, సినీ…

Read more
‘ఇట్లు అర్జున’ కోసం మెలోడీ మేజిక్ క్రియేట్ చేసిన ఎస్. థమన్‌, ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28న రిలీజ్ Telugu News

‘ఇట్లు అర్జున’ కోసం మెలోడీ మేజిక్ క్రియేట్ చేసిన ఎస్. థమన్‌, ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28న రిలీజ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ జర్నీని ప్రారంభించిన మేకర్స్, మే 28న విడుదల కానున్న తొలి సింగిల్‌కు…

Read more