సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్'లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ది బ్లాక్ గోల్డ్' టీం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ సంయుక్త ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతం మధ్యలో నిలబడి కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కథలోని కఠినమైన పరిస్థితులను ప్రతిబింబించేలా ఆ మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌ను చూపించారు. పోస్టర్‌లో సంయుక్త చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపించారు. ఆమె ముఖం మీద దుమ్ము, చేతులపై గాయాలు కనిపించడం కథలో ఘర్షణను ప్రజెంట్ చేస్తోంది. ఈ…
