‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై…
