“హైలెస్సో” నుంచి లైలం బాబుగా శివాజీ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ లైలం బాబు' అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్లో నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆయన పాత్రలోని…
