‘పురుష:’ నుంచి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి పాడిన ‘జాలి పడేదెవ్వడు’ పాట విడుదల
భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా టీజర్‌తో అందరినీ తెగ నవ్వించేశారు. ఇక తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా.. మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా ‘జాలి పడేదెవ్వడు.…
