‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను…
