Skip to content

శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ(అధికార బాధ్యతల స్వీకార వేడుక) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుక చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘విద్యార్థులు నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి’’ అని తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి’’ అని సూచించారు. మెహిదీపట్నం జోన్‌ ఆర్‌ఐ ఎన్‌.స్వాతి గౌరవ అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా…

Read more

నాసా పోటీల్లో ప్రతిభ

ఇటీవల నిర్వహించిన ‘నాసా’ జాతీయ స్థాయి పోటీల్లో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు 3వ బహుమతి సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాలలో బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సౌమ్యా దేవి, ఎన్‌. సుశ్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘విద్యార్థులు సాధించిన ఈ జాతీయ స్థాయి విజయం పాఠశాలకు గర్వకారణం. వీరు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలను సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌.స్వాతి, ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఐపీఎల్‌ ఇంచార్జ్ యాదగిరి, నాసా…

Read more

మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా బి.ఎస్‌. రావు 3వ వర్ధంతి

శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్‌. రావు 3వ వర్ధంతిని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘ బి.ఎస్‌. రావుగారి ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని బి.ఎస్‌.రావు ఆదర్శాలు, విద్య పట్ల వారి అంకితభావాన్ని ప్రతిబింబించే అందమైన చిత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌ ఆర్, ప్రిన్సిపాల్‌…

Read more

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఫాదర్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో శనివారం ఫాదర్స్‌ డేని(పితృ దినోత్సవం) ఘనంగా జరిపారు. ప్రీ ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి హాజరై, మాట్లాడుతూ– ‘‘నాన్న అంటే బాధ్యత. నవ మాసాలు మోసి కన్న అమ్మ రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా మనం జీవితంలో ఎదిగేవరకూ తోడుండే నాన్న కూడా అంతే గొప్పవారు. అందుకోసమే ఆయనకంటూ ఓ రోజుని అంకితం చేస్తూ ఫాదర్స్‌ డేని జరుపుకుంటున్నాం. తల్లిదండ్రులను పిల్లలు ఎల్లప్పుడూ గౌరవించడంతో పాటు వారి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి’’ అని తెలిపారు. ఈ ఫాదర్స్‌ డేలో కోఆర్డినేటర్‌ పుష్పాంజలి, ప్రీ ప్రైమరీ విభాగం ఇన్‌చార్జ్‌ పుష్ప, పీఈటీ…

Read more
ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌ Telugu News

ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్‌ సైన్స్‌ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పుష్ప, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు(మ్యాక్స్‌ విజన్‌ సౌజన్యంతో) నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యురాలు గౌతమి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్‌ చేయాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి, డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌ Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వైవిధ్యమైన ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు అరుణ, కీర్తిలతో పాటు పలువురు టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి.. క్రిస్మస్‌ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తోటివారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, ద్వేషంతో ఉండకూడదని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతాక్లాజ్‌, దేవధూత వేషధారణలతో, నృత్యాలు, నాటికలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ మేథమాటిక్స్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. విద్యార్థులు రామానుజన్‌ వేషధారణల్లో హాజరై, తమదైన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మేథమాటిక్స్‌ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి చేతులమీదుగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more
WhatsApp Image 2025-12-13 at 2.58.00 PM

నాసా కిట్స్ పంపిణీ

శ్రీచైతన్య మెహిదీపట్నం బ్రాంచ్‌లో సోమవారం నాసా ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక నాసా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంటైన్స్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇందిర ప్రియదర్శిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రాజెక్ట్‌లను పరిశీలించి, అభినందించారు. వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ఏజీఎం కృష్ణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పోటీల్లో విద్యార్థులకు ప్రపంచస్థాయి వనరులను కల్పించడానికి తమ పాఠశాల నిబద్ధతలో ఉందని ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రిన్సిపాల్‌ స్వాతి చేతుల మీదుగా విద్యార్థులకు నాసాకిట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు జైపాల్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, డీన్‌ మల్లేష్‌, ఇన్‌చార్జిలు బాల్‌రాజ్‌ , ఆంజనేయులు, నాసా ఇన్‌చార్జి రత్నవేణి పాల్గొన్నారు. ​

Read more