హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ…
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఫాదర్స్ డే
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేని(పితృ దినోత్సవం) ఘనంగా జరిపారు. ప్రీ ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్ ఎన్. స్వాతి హాజరై, మాట్లాడుతూ– ‘‘నాన్న అంటే బాధ్యత. నవ మాసాలు మోసి కన్న అమ్మ రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా మనం జీవితంలో ఎదిగేవరకూ తోడుండే నాన్న కూడా అంతే గొప్పవారు. అందుకోసమే ఆయనకంటూ ఓ రోజుని అంకితం చేస్తూ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నాం. తల్లిదండ్రులను పిల్లలు ఎల్లప్పుడూ గౌరవించడంతో పాటు వారి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి’’ అని తెలిపారు. ఈ ఫాదర్స్ డేలో కోఆర్డినేటర్ పుష్పాంజలి, ప్రీ ప్రైమరీ విభాగం ఇన్‌చార్జ్ పుష్ప, పీఈటీ అనిత, టీచర్లు సంగీత, శ్రీవిద్య, పీఈటీ అనిత, విద్యార్థులు, వారి తండ్రులు పాల్గొన్నారు.








