ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న విడుదల!
మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రం 'బ్లాస్ట్ జోన్' : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం. మే 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది…
