Skip to content

‘జమాన’ సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్..

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా…

Read more

నాసా కిట్స్ పంపిణీ

శ్రీచైతన్య మెహిదీపట్నం బ్రాంచ్‌లో సోమవారం నాసా ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక నాసా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంటైన్స్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇందిర ప్రియదర్శిని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రాజెక్ట్‌లను పరిశీలించి, అభినందించారు. వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ఏజీఎం కృష్ణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పోటీల్లో విద్యార్థులకు ప్రపంచస్థాయి వనరులను కల్పించడానికి తమ పాఠశాల నిబద్ధతలో ఉందని ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రిన్సిపాల్‌ స్వాతి చేతుల మీదుగా విద్యార్థులకు నాసాకిట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు జైపాల్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, డీన్‌ మల్లేష్‌, ఇన్‌చార్జిలు బాల్‌రాజ్‌ , ఆంజనేయులు, నాసా ఇన్‌చార్జి రత్నవేణి పాల్గొన్నారు. ​

Read more