Skip to content

“ఉఫ్ఫ్ యే సియాపా” చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!!

దశాబ్దాల తరువాత మరో సంభాషణ రహిత చిత్రం "ఉఫ్ఫ్ యే సియాపా" సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!! ఉఫ్ఫ్ యే సియాపా: బాలీవుడ్ కథా కథనాన్ని ఒక కొత్త పంథా తో చెప్పబోతున్న బోల్డ్ సైలెంట్ కామెడీ. 40 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వలె, డైలాగులేని, నిజం చెప్పాలంటే డైలాగ్ అవసరపడని సినిమా. నాలుగైదు జనరేషన్స్ మిస్సయిన ఒక అద్భుతం. భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు, కానీ ప్రధాన స్రవంతి సినిమా కు, సంభాషణలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా నుండి సంభాషణలు లేకుండా ధైర్యం చేయడం చాలా అరుదు. జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్…

Read more

అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను – నందమూరి బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ…

Read more

ఘాటీ’అందరికీ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నటుడు విక్రమ్ ప్రభు

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నటుడు విక్రమ్ ప్రభు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? డైరెక్టర్ క్రిష్ గారిని చూసి నేను ఈ సినిమాకు ఓకే చెప్పా. ఆయన నన్ను…

Read more

“లిటిల్ హార్ట్స్” మూవీ ట్రైలర్ రిలీజ్

90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. "లిటిల్ హార్ట్స్" ట్రైలర్…

Read more

సీజన్ 4తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్…

Read more

భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘కొత్త లోక’

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ…

Read more

National sports Day

Y N R Sports Academy,church GaGiLLAPUR. Dr. Laaksha Naidu has received "AN HONOUR PRESENTATION" In the field of Sports on the occasion of NATIONAL SPORTS DAY from the prestigious YNR SPORTS ACADEMY, CHURCH GAGILLAPUR. This award is presented to Dr.Laaksha Naidu for her achievements in the era of Sports as a "NATIONAL WINNER - WHO WON NATIONALS AS A TEAM CAPTAIN" as well received several other awards in Sports (Volleyball, Basketball, Badminton and others) and also A NATIONAL WINNER at…

Read more

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more

డ్యూడ్’ నుంచి ఫస్ట్ గేర్ బూమ్ బూమ్ రిలీజ్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఫస్ట్ సింగిల్ - బూమ్ బూమ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటని సాయి అభ్యాంకర్ స్వరపరిచి పాడారు. ఎనర్జీటిక్ బీట్స్,ఆకట్టుకునే సాహిత్యంతో ఈ సాంగ్ యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. సేనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయి. దీప్తి సురేష్, భూమిక, సాయితో కలిసి…

Read more

రామ్ చరణ్ గారు మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేయడం గ్రేట్ హానర్- రోషన్ కనకాల

-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్లింప్స్- గ్లింప్స్ కు నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల, తన అప్ కమింగ్ మూవీ మోగ్లీ 2025 లో పూర్తిగా భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025, పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్ గ్లింప్స్ తో…

Read more