ఎస్.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం చిన్న సినిమాల హవా నెలకొంది. ఒకవైపు శివాజీ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’, శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ్’ చిత్రాలు నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్, తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎస్.సరస్వతి’. సైకలాజికల్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించగా.. జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి, కిషోర్, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్, తులసీ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు…
