“శంబాల” మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ తో నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేసిన నిర్మాత రాజేష్ దండ
హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయికుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్య మూవీస్ బ్యానర్ లో ఆది సాయికుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రొడ్యూసర్ రాజేష్ దండా వెల్లడించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో హాస్య మూవీస్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం హీరోగా "కె ర్యాంప్" మూవీని నిర్మించి ఘన విజయాన్ని దక్కించుకుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్…
