కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచిన రాకింగ్ స్టార్ యశ్
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మేకర్స్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 20న ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తామని టీం ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా కనిపిస్తోంది. మంచు ప్రాంతమైనా కూడా ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఇక అలా రక్తపాతాన్ని సృష్టించిన అనంతరం యశ్ మత్తులో మునిగేందుకు మందు తాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘టాక్సిక్’ ఒకటిగా నిలిచింది. ఒక్కో కారెక్టర్, పాత్రకు సంబంధించిన సంబంధించిన…
