మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’
▪️మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న ‘త్రికాల’ ▪️ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ▪️ ట్రైలర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా నచ్చడంతో చాగంటి…
