Skip to content

దసరాకు థియేటర్లలో యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’

ఈ దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఆనందించేలా ఒక అద్భుతమైన ఫాంటసీ కామెడీ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు ప్రకటించాయి. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పేరు 'నయ్యి నవెల్లి'. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 16 అక్టోబర్ 2026న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మీరట్‌ నగరంలోని ఒక చలాకి కుటుంబంలోకి పెళ్లై కొత్తగా కోడలు అడుగుపెడుతుంది. ఆమె రాకతో ఆ ఇల్లు చాలా…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో

శ్రీకాంత్, లయ హీరో–హీరోయిన్లుగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో స్త్రీమింగ్ అవుతోంది, థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటిటిలో చూసి ఈ ఫన్ ఎంటర్టైనర్ ను ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. హీరో శ్రీకాంత్ కు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సన్నివేశాలకు థియేటర్లలో విశేష స్పందన లభించింది, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మధ్యతరగతి…

Read more

‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది – వేధా జలంధర్

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆమె చెప్పిన సంగతులివే.. మీ జర్నీ గురించి చెప్పండి? నేను 2019లోనే కెరీర్ ప్రారంభించాను…

Read more

‘గీతాంజలి’ ఆగస్టు 28న వరల్డ్‌వైడ్ రీ-రిలీజ్

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా…

Read more

‘ఇరుముడి’ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది: దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో కనిపిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆయన కనిపిస్తారా? -లేదండి. అది సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. రామ్ చరణ్ గారు అయ్యప్ప భక్తులు. ఆయనకు ఆ వైబ్…

Read more

#Mega158 సంక్రాంతికి రిలీజ్‌

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి ప్రస్తుతం #Mega158 / #ChiruBobby2 చేస్తున్నారు. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాబీ కొల్లి తన విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పూర్తి సపోర్ట్‌తో, టీమ్ అంతా ఒకే స్పీడ్‌లో పనిచేస్తుండటంతో సినిమా షూటింగ్ ఇప్పటికే 40 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత కీలకమైన ప్రోగ్రెస్ సాధించడం సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో స్పష్టం అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయింది. ఇప్పటివరకు తీసిన ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. కథలో…

Read more

‘సిగ్మా’ అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్

-లైకా ప్రొడక్షన్స్ – సుభాస్కరన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరింత పెరిగిన అంచనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాల్లో ‘సిగ్మా’ ఒకటి. లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆసక్తికరమైన కాస్టింగ్‌తో పాటు ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా కథ, మెయిన్…

Read more

సెప్టెంబర్ 3 న “డెలులు” సినిమా టీజర్

క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్‌గా పెట్టడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. తాజాగా నిర్వహించిన స్టూడెంట్ ఈవెంట్‌లో చిత్ర బృందం గ్రాండ్‌గా టైటిల్‌ను ప్రకటించింది. సంకీర్త్ కొండ నిర్మాతగా, ప్రీతం కస్తూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా, రెష్మిత్ ఎస్ కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. ఈ చిత్రానికి జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హరికృష్ణ కురపాటి ఎడిటర్‌గా, ఆది చెబ్రోలు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల ప్రధాన…

Read more

“దొరికిందా” చిత్రం ప్రారంభం

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే స్క్రిప్ ను ప్రముఖ నిర్మాత పద్మిని నాగులపల్లి అందించారు . ఈ సందర్భంగా సినిమా టీం కు శ్యామలాదేవి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ" ఈ చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా చిత్రం "దొరికిందా" మంచి కమర్షియల్ మూవీ అవుతుందని…

Read more

21 నుంచి సోనీ లివ్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీమియర్

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ…

Read more