చిరంజీవి – బాబీ కొల్లి కాంబో మరోసారి.. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 'వాల్తేర్ వీరయ్య' సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్ - #చిరుబాబీ2 / #చిరు158 తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమం మరింత…
