“లెనిన్” గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది : నటుడు శివాజీ
'లెనిన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన సినీ ప్రయాణం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున ఇచ్చిన అవకాశంతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు నాగార్జునతో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. 'లెనిన్' తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా అని చెప్పిన శివాజీ, ఈ చిత్రంలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయని, ఆర్టిస్టులు కనిపించరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అఖిల్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని, అభిమానులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాంటి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అన్నారు. అఖిల్ విజయం కోసం నాగార్జున చేసిన కృషిని…
