Skip to content

“ఫెయిల్యూర్ బాయ్స్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్ పై వి ఎస్ ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఫెయిల్యూర్ బాయ్స్" సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్ర బృందం రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఫెయిల్యూర్ బాయ్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్…

Read more

‘చాయ్ షాట్స్’ కంటెంట్, క్రియేటర్స్ సినిమాస్ లానే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను: రానా దగ్గుపాటి

చాయ్ బిస్కెట్ నుంచి మరో సంచలనం – ‘చాయ్ షాట్స్’ గ్రాండ్ గా లాంచ్ భారతదేశంలో తొలి రీజినల్ షార్ట్-సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ₹20 కోట్ల క్రియేటర్ ఫండ్, ‘45 డేస్ పిచ్-టు-లైవ్’ ప్రామిస్ తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్నచాయ్ బిస్కెట్, దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్” లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. Info Edge Ventures, General Catalyst మద్దతుతో రూపుదిద్దుకున్న చా షాట్స్—ఎండ్లెస్ స్క్రోలింగ్‌ నుంచి స్ట్రక్చర్డ్, హై-క్వాలిటీ కథలు, ఎంటర్…

Read more

1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదల అయిన విక్రమ్ పూల రచించిన 1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాము. ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లు గా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more

అవతార్: ఫైర్ అండ్ యాష్ — ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ!”

'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీకి భారతీయులు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం.. కేవలం అందులోని విజువల్స్, టెక్నాలజీ లేదా ఐమాక్స్ (IMAX) స్కేల్ మాత్రమే కాదు; ఆ కథలో అంతర్లీనంగా ఉన్న పక్కా భారతీయ భావోద్వేగాలే అసలు కారణం.   'అవతార్' సిరీస్‌లో హీరో జేక్ సల్లి పాత్ర అచ్చం మన భారతీయ కుటుంబ పెద్దల తరహాలోనే ఉంటుంది. కుటుంబానికి అండగా నిలబడటం, పిల్లల రక్షణే పరమావధిగా బతకడం, నైతిక విలువలు, త్యాగనిరతి... ఇవన్నీ ఆయన పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నేటిరి విషయానికి వస్తే—ఆమె ఒక తల్లిగా, యోధురాలిగా ఇంటికి దొరికిన బలం. కుటుంబం కోసం దేన్నైనా ఎదిరించే ఆమె…

Read more

భయపెట్టేలా హారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ ట్రైలర్‌..

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు…

Read more

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా హీరో సుమన్ గారి చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర…

Read more

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి మోహనకృష్ణ, నందమూరి రూప

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు చేతుల మీదగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం లో మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ప్రతిష్టించడం…

Read more

ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ “గుర్రం పాపిరెడ్డి”

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "గుర్రం పాపిరెడ్డి" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ ఫన్నీగా రూపొందించారు. ఈ వీడియోలో యాక్టర్స్ ఫరియా అబ్దుల్లా, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి మూవీ ప్రమోషన్ కోసం హిలేరియస్ కంటెంట్ చేయడం,…

Read more

స్టార్ హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ “అన్నగారు వస్తారు” నుంచి ‘అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ "అన్నగారు వస్తారు" ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. . ఈ రోజు "అన్నగారు వస్తారు" చిత్రం నుంచి 'అలాపిక్కే ఉమ్మక్' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్ తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే…

Read more

పాల్వంచలో అట్టహాసంగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవ వేడుక

పేదల పక్షపాతి, సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 6) పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రయూనిట్ తో పాటు సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్…

Read more