కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా 'కాంత'. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు. కాంతలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏం అనిపించింది? -కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఫుల్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్…
