‘మిత్ర మండలి’ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి.. ఈ మూవీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు
బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న…
