“సర్కారు బాయి” సినిమా నుంచి వర్షిక బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ వర్షిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్…
