జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ మ్యాజికల్ అనుభూతిని అందించబోతోంది. ఎస్.ఎస్. తమన్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఓజీ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్‌ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. అనిరుధ్ గారి ‘హుకుం టూర్’ ఎంతటి ప్రభావాన్ని చూపిందో, మనకు ‘ఓజీ టూర్’ కూడా అంతటి బలాన్ని ఇచ్చింది. ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ…
