Skip to content

Mardaani 3 collects 28 crore worldwide in 3 days

Yash Raj Films’ hit franchise Mardaani 3, starring Rani Mukerji, grew by 81 percent from Friday to Sunday, taking total India collections to 17.25 crore in 3 days and worldwide collections to 28 crore gross (India 21 crore gross and overseas 7 crore gross)! The huge jumps that Mardaani 3 witnessed day on day, coupled with unanimously positive word of mouth, Mardaani 3 is set to spread its hard hitting message to many in the days to come. On opening…

Read more

‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల

ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగిన గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్‌ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం…

Read more

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది -దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా పని చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో.. దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. ‘‘శబార’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ‘శబార’కి కూడా అలానే సపోర్ట్…

Read more

ఇండ‌స్ట్రీ అంతా క‌లిసి ముందుకు రావ‌టం నిజంగా అద్భుతం: ర‌ణ్‌భీర్ క‌పూర్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌ణ్‌భీర్ క‌పూర్ త‌న ఇష్ట‌మైన న‌టి రాణీ ముఖ‌ర్జీ 30 వ‌సంతాల ప్ర‌స్థానాన్ని మ‌ర్దానీ 3 సినిమాతో సెల‌బ్రేట్ చేయ‌టానికి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ క‌లిసి ముందుకు రావ‌టం చూసి చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ణ్‌భీర్ క‌పూర్ డెబ్యూ మూవీ సావ‌రియాలో రాణీ ముఖ‌ర్జీతో క‌లిసి న‌టించారు. ఈ సినీ ప్ర‌యాణంలో క్లిష్ట స‌మ‌యాల్లో ఆమె అత‌నికి తోడుగా నిలిచింది. అందుక‌నే రాణి ప్ర‌యాణంలో, ప్ర‌తి సినిమా స‌క్సెస్ కావాల‌ని ర‌ణ్‌భీర్ కోరుకుంటుటుంటాడు. ఈ సంద‌ర్భంగా ర‌ణ్‌భీర్ క‌పూర్ మాట్లాడుతూ ‘‘రాణీ ముఖర్జీ సావరియా చిత్రంలో నాతో కలిసి నటించారు. నేనెంతో కష్టపడి నటించానని నాకు చెప్పి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి త‌నే. నాకు, ఆమె జ‌రిగిన సంభాష‌ణ‌ను…

Read more

గాంధీ టాక్స్‌ ట్రైల‌ర్ విడుద‌ల‌..

క్యూరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి జీ స్టూడియోస్ రూపొందిస్తోన్న మూవీ ‘గాంధీ టాక్స్’ ట్రైల‌ర్ విడుద‌లైంది. రొటీన్‌గా మ‌నం చూసే సాంప్ర‌దాయ‌ల‌ను బ‌ద్ద‌లు కొడుతూ, ధైర్యంగా వైవిధ‌మ్యైన క‌థ‌నాల‌కు, కంటెంట్‌కు ప్రాధాన్య‌మిచ్చే సినిమాల‌పై జీ స్టూడియోస్‌కున్న న‌మ్మ‌కాన్ని ఈ సినిమా బ‌లంగా చూపిస్తోంది. సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ అంటే శ‌బ్దాలు, హంగామా ఉంటుంది. కానీ వీటికి భిన్నంగా ‘గాంధీ టాక్స్’ నిశ్శ‌బ్దంగా, ఆత్మ విశ్వాసంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ట్రైల‌ర్‌లో ఎలాంటి డైలాగ్స్ లేవు. అయిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన దృశ్యాలు, భావోద్వేగంతో నిండిన నిశ్శ‌బ్దం అన్నీ చాలా విష‌యాల‌ను చెబుతున్నాయి. ప్రేక్ష‌కులు సినిమాను చెవుల‌తోనే కాదు.. మ‌న‌సుతో వినాల‌ని ఇచ్చిన స్టేట్‌మెంట్‌లా ఇది మ‌న‌కు…

Read more

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

* నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ త‌న 36 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌ శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు . విభిన్న‌మైన క‌థ‌లు, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మ‌రోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండ‌రీస్ రేంజ్‌ను మ‌రింత పెంచ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సినీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను…

Read more

ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్

‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం.. టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సిటీ…

Read more

‘చీన్ టపాక్‌ డుం డుం’ ఘనంగా ప్రారంభం

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం'. అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం' తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి,…

Read more

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్ముతుంటారు. ఆ న‌మ్మ‌కంతో ఆయ‌న చేస్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార‌’. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌టంతో పాటు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్‌, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్నం నిర్మిస్తున్నారు…

Read more

జ‌న‌వ‌రి 30న థియేట‌ర్స్‌లో ‘గాంధీ టాక్స్’ సంద‌డి

* ‘గాంధీ టాక్స్’ టీజ‌ర్‌.. శ‌బ్దంతో నిండిన సినిమా ప్ర‌పంచంలో సైలెంట్ ఫిల్మ్‌తో నిశ్శ‌బ్దాన్ని ఆవిష్క‌రించ‌నున్న జీ స్టూడియోస్ స్టోరీ టెల్లింగ్‌లో శ‌బ్దంతో నిండిన‌ సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శ‌బ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్ర‌య‌త్నంగా కనిపిస్తోంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా, దృష్టిని మ‌ర‌ల్చ‌నీయ‌కుండా, మాట‌ల‌తో ప‌ని లేకుండా రా ఎమోష‌న్స్‌తో, క‌ట్టిప‌డేసే దృశ్యాల‌తో, భావోద్వేగ ప్ర‌పంచంలోకి ఆడియెన్స్‌ను ఇది ఆహ్వానిస్తోంది. ఒక డైలాగ్ కూడా లేకుండా రూపొందిన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతుంది.ఉద్వేగ భ‌రిత‌మైన నిశ్శ‌బ్దంతో కూడిన ఈ ఇంటెన్స్ విజువ‌ల్స్ మ‌న‌సుల్లో ఓ సంఘ‌ర్ష‌ణ‌ను, అశాంతి, మార్పును సూచిస్తూ.. గాంధీ నిజంగా ఏదో చెప్ప‌బోతున్నాడ‌నే ఆస‌క్తిని…

Read more