‘బ్యాండ్ మేళం’ నుంచి ఎనర్జిటిక్ సాంగ్ ‘తిప్పుకుంటన్నవ్’ రిలీజ్
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ మూవీని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ ‘తిప్పుకుంటన్నవ్’ పాటను రిలీజ్ చేశారు. శనివారం నాడు రిలీజ్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇన్ స్టంట్‌గా చార్ట్ బస్టర్ అయింది. ‘బ్యాండ్ మేళం’ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ యూత్‌ని ఇట్టే ఆకట్టుకుంది…
