‘గాంధీ టాక్స్’ .. జనవరి 30న గ్రాండ్ రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘గాంధీ టాక్స్’కు సంబంధించి విడుదల తేదిని అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌గా ‘గాంధీ టాక్స్’ రూపొందింది. కథను వివరించటానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా నిలుస్తోంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్యమైన, సృజనాత్మకమైన అడుగు. సినిమాను ఎంత గ్రాండియర్‌గా, ఎలాంటి సౌండ్‌తో రూపొందించారంటూ లెక్కలు వేసే నేటి రోజుల్లో గాంధీ టాక్స్ సినిమా తన సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా, భావోద్వేగాలతో చెప్పబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి అద్భుతమైన నటీనటులు నటించారు…
