Skip to content

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం.. హీరో శివ కందుకూరి

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం..  హీరో శివ కందుకూరి Telugu News

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్ వాలా’ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’ అని టైటిల్ అనుకున్నాం. నా ఫోన్‌లో ప్రమోద్ పేరు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు విధి చివరకు ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ను పెట్టేలా చేసింది. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు. ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తోనే మళ్లీ ప్రమోట్ చేద్దామని టీం అంతా ముందుకు వచ్చింది. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ మూవీని చేశాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. చిత్రం చూసి బయటకు వచ్చిన తరువాత కచ్చితంగా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు. ఫిబ్రవరి 20న ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త పేరుతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా, ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ .. ‘అసలు మాకు టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబైకి వెళ్లాను. సెన్సార్ టీంతో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ అనే టైటిల్ వద్దు అని చెప్పారు. ఆ తరువాత మేం చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ మేం వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్న ‘నవాబ్ కేఫ్’నే చివరకు ఫిక్స్ చేశాం. మా ఈ ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మాకు మీడియా సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ .. ‘‘చాయ్ వాలా’ టైటిల్‌ను మేం కొన్ని కారణాలతో మార్చాం. సెన్సార్ వారి గైడ్ లైన్స్, రూల్స్ ప్రకారం కొత్త టైటిల్‌ను పెట్టాం. నేను చూసిన, అనుభవించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథను రాసుకున్నాను. మా ఈ ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లాలని మీడియాని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ .. ‘ఏ టైటిల్ పెట్టినా కంటెంట్ బాగుంటే, సినిమా నచ్చితే ఆడియెన్స్ ఆదరిస్తారు. ఇది నా మొదటి చిత్రం. మా ‘నవాబ్ కేఫ్’ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓ మంచి ప్రొడక్ట్ బయటకు రావాలనే ఇలా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మా సినిమా రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

తారాగణం: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ : హర్షిక ప్రొడక్షన్స్
రచయిత & దర్శకుడు: ప్రమోద్ హర్ష
నిర్మాత : రాధా వి పపుడిప్పు
సహ నిర్మాత: వెంకట్ ఆర్ పాపడిప్పు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
DOP: క్రాంతి వర్ల
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
ఎడిటర్: పవన్ నరవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శశి కె నారాయణ
పీఆర్వో : వంశీ కాకా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.